రమణీయం రామప్ప

Ramappa temple
డా॥ ఈమని శివనాగిరెడ్డి స్థపతి, 98485 98446

రామప్ప దేవాలయానికి నిర్మాణ సహకారాన్ని అందించింది రేచర్ల రుద్రుడు. అతడు శివలింగాన్ని ప్రతిష్టించి ఆలయాన్ని తన పేర ‘రుద్రేశ్వరుడ’ని పిలుచుకొన్నాడు. ఇప్పుడు దాన్ని ‘రామలింగేశ్వరుడ’ని పిలుస్తున్నారు.

ఈ దేవాలయానికి రామప్ప దేవాలయమని పేరెలా వచ్చిందో ఖచ్చితమైన ఆధారాలు లేవు. కొందరు గుడి కట్టిన శిల్పి పేరు రామప్ప అనీ, అందుకే ఆ దేవాలయాన్ని రామప్ప దేవాలయమని పిలుస్తున్నారని గ్రామస్తులంటారు. ఏమైనా, గణపతిదేవుని సైన్యాధ్యక్షుడిపైన రేచర్ల రుద్రిడ్డి (రువూదుడు) పాలంపేటలో క్రీ.శ.1213లో నిర్మించిన రామప్ప దేవాలయం కాకతీయ దేవాలయాలన్నింటిలోకీ మణిపూసగా చెప్పుకోవాలి.

దేవాలయ అమరిక
రామప్ప దేవాలయం గర్భాలయం, అర్ధమండపం, రంగమండపం, నంది మండపంతో కుడివైపున కామేశ్వరాలయం, కళ్యాణమండపం, ఎడమ వైపున కాటేశ్వరాలయాలతో చుట్టూ ప్రాకారంతో 7578927064_436c62121c_kనిర్మాణమైంది.

ఉపపీఠం
పీఠమంటే అధిష్ఠానం. దేవాలయం మొత్తం దేనిమీద నిలబడి వుంటుందో దాన్ని ‘అధిష్ఠానం’ అంటారు. అంటే దేవాలయానికి ‘పాదం’ లాంటిది. ఈ అధిష్ఠానం కింద ఉండే వరుసల్ని ‘ఉపపీఠం’ అంటారు. రామప్ప దేవాలయ ఉపపీఠం చూడటానికి ఎత్తుగా, చుట్టూ ప్రదక్షిణ చేయటానికి విశాలంగా ఉంది. ఆధారశిల, ఉపానం, పద్మం, పట్టిక, కుముదం, పట్టిక, అధోపద్మం అనే ఉపపీఠం వరుసలపై ఎలాంటి అలంకార శిల్పమూ లేక సాదాగా వున్నాయి.

అధిష్ఠానం
అధిష్ఠానానికి ఉపానం, కుముదము, కపోతము దానిపైన ఏనుగుల వరుస (గజధార)లున్నాయి. కపోతం వరుసపై మట్టానికి సమంగా గర్భాలయ, అర్ధమండప, రంగమండపాల నేల రాళ్ళు పరచబడినాయి. ఏనుగుల వరుస గల రాయిపై ఏనుగులు మనిషిపై దాడి చేస్తున్నట్లు, గణపతి, భైరవ, గజలక్ష్మి, మల్లయుద్ధం, సూర్యుడు, మకరం (మొసలి), వ్యాళాలుఉన్నాయి.

కక్షాసనాలు
దేవాలయ రంగమండప అధిష్ఠానంపై గల ఏనుగుల వరుసలున్న రాయిపైన నిలువుగా ఒక పిట్టగోడ లాంటి రాయి వుంది. దీన్ని ‘కక్షాసనం’ (ఆనుకుని కూర్చోటానికి) అంటారు. మండపం లోపల ఒక మూడు వరుసల వేదిక, దానిపై భక్తులు కూర్చోవటానికి అరుగుగా ఉపెూగపడుతుంది. తూర్పువైపు ప్రవేశద్వారం నుంచి రంగమండపం అరుగుపైన 20 కక్షాసన ఫలకాలున్నాయి. వాటిపై జైనతీర్ధంకరులు, డాలు కత్తి పట్టిన యోధులు, నాట్యగణపతి, చామరధారి, విల్లు, బాణం పట్టుకొన్న వేటగత్తె, భటులు, భైరవుడు, గణిక, వేణుగోపాల, మల్లయుద్ధ దృశ్యాలు, సాలభంజిక (కొమ్మను పట్టుకొని వయ్యారంగా నిలబడిన స్త్రీ) నాట్యగత్తెలు, అటూ ఇటూ మద్దెలను వాయిస్తున్న వాద్యగాండ్లు, నాగిని, సూర్య, శృంగార మైథున శిల్పాలు, నగ్నంగా వున్న ఋషి పుంగవులు, శివభక్తులు, భటుల బొమ్మలు ఉన్నాయి. మధ్య మధ్యలో నాలుగు దళాల పద్మాలు, పట్టీలు వున్నాయి. ఈ కక్షాసనాలను వెనకగోడగా చేసుకొని రంగమండపం లోపలి వైపున చుట్టూ ఏడు చిన్న దేవాలయాలు ఉన్నాయి. రెండింటిలో మాత్రం దేవి, గణపతి విగ్రహాలున్నాయి. కేవలం కాకతీయుల దేవాలయ రంగమంటపాల్లోనే ఇలాంటి చిన్న దేవాలయాలు పరివారాలయాలుగా వుండటం గమనించాల్సిన విషయం.

ramappa1పాదవర్గం
అధిష్ఠానంపైన ఉండే దేవాలయ గోడభాగాన్ని ‘పాదవర్గం’ అంటారు. రామప్ప దేవాలయ గర్భాలయ, అర్ధమండపాల వరకూ వున్న గోడభాగం, కింద వేదిక, పొడవాటి స్తంభభాగం, దానిపైన కలశం, ఫలిక, పద్మం, పోదిక (బోదె) వున్నాయి. అడ్డంగా చూస్తే ఒకవైపు నుంచి మరోవైపుకు కర్ణకూటం, అహార, పంజర, ముఖశాల మళ్ళీ పంజర, అహార, కర్ణకూటాల అమరిక వుంది. ముఖశాల మధ్యభాగంలో మూడంచెలున్న కోష్టము, దానిపై శిఖరం, కోష్టం పక్క గోడలకు స్వస్తిభద్ర కిటికీలు, ఒక్కో అంచెకు కపోతం, వ్యాళ వర్గాలున్నాయి. కోష్టం కింద గజధార, దానికింద యధావిధిగా అధిష్ఠానం ముందుకు పొడుచుకొచ్చాయి. కుముద భాగం మధ్యలో చక్కటి నంది విగ్రహం వుంది. నంది కేవలం శివుని వాహనమే కాదు. వ్యవసాయానికి తోడ్పడి తిండి గింజలందించేది. కాబట్టి, దానిపట్ల కాకతీయులు మక్కువ పెంచుకొన్నారు. అలాగే, గర్భాలయ గోడల ముఖశాల మధ్యలో మూడువైపులా మూడు కోష్ఠాలున్నాయి. కర్ణకూట అహార భాగాల్లో రెండు స్తంభాల కోష్ఠాలపై మూడంతస్తుల విమానముంది.

ప్రస్తరం (చూరుగల కప్పు)
గర్భాలయం, అర్ధ మండపం, రంగమండపంపైన గోడలపై వర్షం నీరు పడకుండా బాగా వెడపూ్పైన ప్రస్తర కపోతముంది. దాన్ని చూరు అనవచ్చు. కిందనుంచి చూసే వారికి కొయ్యతో బాడిసె ఉలిపెట్టి పట్టీలు, బద్దెలు, చివర చూరునుంచే వర్షపు బిందువుల మాదిరి బొంగరం లాంటి రాతి బుడిపెలు కనబడేలా చెక్కారు. ఈ బుడిపెలనే సమరాంగణ సూత్రధారమనే శిల్పశాస్త్రాన్ని రచించిన భోజమహారాజు నకీ.శ.1వ శతాబ్ది) ‘ఝారావళి’ అని పిలిచారు. అంటే చూరు నుంచి రాలే ‘చిటుక్కు, చిటుక్కు వానచుక్కలని’ అర్ధం. కపోతం కింద ఉత్తరమనే దూలం వరుస, కపోతంపైన వ్యాళమనే వరుసా వున్నాయి.

శిఖరం (విమానం)
కప్పు వరకూ రాతితో కట్టిన రామప్ప దేవాలయ ప్రస్తరం పైన ఇటుకలతో కట్టిన మూడంతస్తుల ‘విమాన’ముంది. అనేక రకాల కొలతలతో నిర్మించటం వల్ల దీన్ని విమాన (నానా మానవిధానత్పాత్ విమానం పరికల్పయేత్) మన్నారు. కాకతీయుల కాలపు విమానం శిథిలమైతే నలభై ఏళ్ళక్షికితం దీన్ని పునర్నిర్మించారు. కూటకోట లక్షణం ద్రావిడ పద్ధతిలో కట్టిన విమాన శిఖరం చదరంగా వుంది. దానిపైన కలశముంది. విమానం ముందు భాగాన అర్ధ మండపంపైన రెండో అంతస్తు వరకూ ఉన్న కట్టడాన్ని శుకనాసి చిలుకముక్కు (చి.ము) అంటారు.

నీళ్లపై తేలే ఇటుకలు
రామప్ప శిల్పులు సకల విద్యావూపవీణులు, ప్రయోగశీలురు. వాళ్లు ఎంతటి ప్రతిభాశాలులూ అంటే అప్పటికే భారీశిలలతో బరు దేవాలయానికి మరింత బరువు కాకూడదని, గర్భగుడిపై విమానాన్ని నీళ్లలో తేలే ఇటుకలతో నిర్మించి, నిర్మాణ రంగంలో యావత్ భారతదేశంలోనే తమకెవరూ సాటిలేరన్న విషయాన్ని రుజువు చేశారు.

రంగమండపం
రామప్ప దేవాలయ గర్భగృహం, అర్ధమండపం తరువాత వున్న చదరపు మండపాన్ని ‘రంగమండపం’ అంటారు. దీనికి మూడువైపులా భక్తులు లోనికి వెళ్ళడానికి దారులున్నాయి. దేవుని విగ్రహానికి చేసే అలంకరణలను అంగభోగమని, రంగశిలనుంచి అర్పించే నాట్యాన్ని రంగభోగమనీ, రెండింటినీ కలిపి అంగరంగ భోగాలనీ అంటారు. ఈ మండపంలో మధ్యన ఎత్తైన నాలుగు ప్రధాన స్తంభాలు, చుట్టూ వేదిక మీద కురచస్తంభాలు వున్నాయి. కపోతం వంగిపోతుంటే అప్పటి పురావస్తు శాఖ సంచాలకులు డా॥ గులాం యజ్దాని చుట్టూ అదే సాదాగా చెక్కించిన రాళ్ళతో స్తంభాపూత్తించాడు. దానిపై నున్న వ్యాళ వర్గం శిథిలమైతే దాన్ని కూడా రాతితో పిట్టగోడ మాదిరిగా కట్టించాడు. నిజానికి కాకతీయుల పిట్టగోడపై ప్రధాన ఆలయాన్ని పోలిన చిన్న ఆలయాల వరుస వుంటుంది.

రంగమండప స్తంభాలపై శిల్పం
రంగమండపం మధ్యనున్న నాలుగు స్తంభాలు, దూలాలు, కప్పు రాళ్ళను నల్ల శానపు రాతితో7578927640_496749648a_k చెక్కారు. వాటిని ఎంత నున్నగా చెక్కారంటే చూసుకుంటే మన ముఖం కూడా కనపడుతుంది. ఇక, ఆగ్నేయంలో వున్న స్తంభానికి కింద అశ్వపాదం, స్తంభభాగం దానిపై నాట్య గణపతి, ఎకచెక్కాలాడుతూ శృంగారం భంగిమల్లో ఉన్న దంపతులు, ఒక సైనికుడు, అతని భార్య (కొంతమంది పరిశోధకులు ఈ శిల్పాన్ని రేచర్ల రుద్రసేనాని, అతని భార్యగా వర్ణించారు), నాట్యగత్తెలను చెక్కారు. నైరుతిలోని స్తంభంపైన నాట్యగత్తెలు, రతీ మన్మథ, అమృత మధన దృశ్యాలు, వాయువ్య స్తంభం మీద గోపికా వస్త్రాపహరణం, నాట్యగాళ్ళు, ఈశాన్య స్తంభంపై డిజైన్లు వున్నాయి. స్తంభాలపైన కలశం, దాడి, ఫలికా పద్మాలను బంగారు పనిచేసే కంసాలులు తీర్చి దిద్దారా అన్నట్లుంది. దానిపై నాలుగు వైపులా నాలుగు ముఖాలున్న బోదెలు వున్నాయి.

రంగమండప దూలాలు
బోదెలపైన గల దూలాలపై కూడా వెన్నతో తీర్చిదిద్దారా అన్నట్లుగా లెక్కలేనన్ని దేవతా మూర్తుల్ని సులువుగా చెక్కారు. తూర్పువైపు దూలం ఎదురుగా శివ కల్యాణ సుందరమూర్తి, దూలం కింది వైపున బ్రహ్మ, విష్ణువుల మధ్య నర్తనమాడుతున్న నటరాజు, ఏకాదశ రుద్రులు, లోపలి వైపు త్రిపుర సంహారమూర్తి, దక్షిణం వైపు దూలంపై ఎదురుగా, నందీశ్వర, బ్రహ్మ, విష్ణు, వాహనాలపైనున్న దిక్పాలకులు, సప్తర్షులు, దూలం కిందవైపున గజాసుర సంహారమూర్తి, లోపలివైపు అమృతకలశానికి అటూ ఇటూ దేవతలు, పడమర దూలం ఎదురుగా దేవతా శిల్పాలు, దూలం కింది వైపున దిక్పాలకుల మధ్య నటరాజు, లోపలి వైపు సాగరమధన దృశ్యం, ఉత్తరం వైపున దూలంపై ఎదురుగా రుషులు, కింది వైపు గజాసుర సంహారమూర్తి, లోపల రామరావణ యుద్ధ దృశ్యాలు రమణీయంగా మలిచారు. దూలాలపైన మధ్యలో (మూలరాళ్ళు) కోణవట్ట, చదరవట్టాల (చదరపు రాళ్ళు)పై దిక్పాల శిల్పాలు, మధ్యన నటరాజశిల్పం చూపరుల దృష్టిని మరల్చటమే కాక మెడనొప్పిని కూడా కలిగిస్తుంది. ఎందుకంటే, ఏ శిల్పానికి ఆ శిల్పం అద్వితీయం, కనుక!

మదనిక నాగిని శిల్పాలు
రంగమండప కక్షాసనాల వెనుక వేదికపై నిలబెట్టిన కురచ స్తంభాలున్నాయి గదా! వాటి వెలపలి వైపు నుంచి దూలాల బోదె భాగాల్లోకి నల్ల శానపురాతితో చెక్కిన ఏనుగుపైనున్న సింహాన్ని పోలిన ఉహాత్మక జంతువు -యాళి – గజకేసరి శిల్పాలు, నాగినీ, మదనికా శిల్పాలు ఉన్నాయి. చక్కటి అంగసౌష్టవంతో వొంపుసొంపులు, హొయలూ, వయ్యారాల కలపబోతగా తీర్చిదిద్దిన సుందరీమణులు కాకతీయుల కాలపు అందమైన యువతుల రూపలావణ్యానికి ప్రతిబింబాలు. నల్లశానపు రాతిలో చెక్కిన రంగమండప వాయువ్యభాగంలో ఐదు గజకేసరి శిల్పాలు, తరువాత తూర్పు ద్వారానికి రెండువైపులా ఇద్దరేసి నాట్యగత్తెలు, నాగినులు, మద్దెల వాయిస్తున్న యువతులు. తూర్పువైపు ద్వారానికి ఎడమవైపున్న యువతి ఎత్తు మడమల చెప్పులతో ఫ్యాషన్లలో ఫ్రెంచి అందగత్తెల్ని తలదన్నే రీతిలో ఉంది. మరో యువతి వంటిపై జారిపోతున్న ఎంబ్రాయిడరీ అల్లికలు, అప్పటికి కొంగొత్త డిజైన్లు అద్దుకున్న బట్టలతో అందమంతా తన సొంతమేనన్నట్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ సుందరీమణులు తమ కురులను అందంగా అలంకరించుకొన్న తీరు, చెవులకు పెద్దసైజు గుండ్రటి దుద్దులు, నాజూకైన బంగారు నగలు, నాట్య భంగిమలు. ఆ సొగసుగత్తెల మాటే చేయి తిరిగిన శిల్పుల పనితనానికి మనం అబ్బురపడతాం. అంగాంగానికి పొందుపరచిన ఆభరణాలతో అప్సరసలను సైతం కవ్వించి, అలంకరణలో, అందంలో తమకు సాటిరాదన్న గర్వంతో సవాళ్ళు విసురుతూ, అలనాటి తెలంగాణ ప్రాంత యువతులు మొదటి నుంచీ సౌందర్యోపాసకులని రుజువు చేస్తున్నాయి.7578928150_ea2c36ce62_k

ద్వారశాఖలు
గర్భాలయంలో ప్రతిష్టితమైన రుద్రేశ్వరుని దర్శించాలనుకొన్నా వీటన్నిటినుంచి దృష్టి మరల్చాలి. అవును. అపురూపంగా చెక్కిన ద్వారబంధాలు, వాటి శాఖలు, కింద సుందరశిల్పాలు, వేటగత్తెలపాట్లు, లోనికి వెలుతురు రావటానికి కిటికీలు, కిటికీ కళ్లపై అలనాటి నాట్యభంగిమలు, కరణాలు, అభినయ, నృత్యరీతులు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. బహుశా రేచర్ల రుద్రుడు, జాయపసేనాని సహవాసం వల్ల అబ్బిన నాట్యాభిరుచిని ఇక్కడ తెలియజెప్పాలనుకున్నారేవెూ! ద్వార బంధాల కిందున్న గడపపై రమణీయ శిల్పం, పైనున్న పతంగంపై నటరాజు తాండవం చూపరులను మమేకం చేస్తుంది. ఇక్కడ మలచిన నాట్య భంగిమలను, జాయపసేనాని రచించిన ‘నృత్య రత్నావళి’లోని నాట్య సంప్రదాయాలను డా॥ నటరాజ రామకృష్ణ తులనాత్మకంగా పరిశీలించి, పరిశోధించిన ఎన్నో నాట్య విశేషాలను ప్రపంచానికి తెలియజెప్పారు. వారు 1985లో రామప్ప దేవాలయ ప్రాంగణంలో పేరిణి నృత్యవూపక్షికియను వేలమంది సమక్షంలో ప్రదర్శించిన విషయం లోక విదితమే.

నంది మండపం
దేవాలయ దర్శనమైన తరువాత రంగమండపం బయటికొచ్చిన వారికి, తంజావూరు బృహదీశ్వరాలయంలో మాదిరిగా వ్యవసాయం పట్ల మక్కువ గల కాకతీయ రాజుల అభిమతానికి మచ్చుతునకగా, దుక్కిటెడ్లపట్ల గల మమకారాన్నంతా కలిపి చెక్కించుకొన్న నంది కనిపిస్తుంది. దీన్ని ప్రతిష్టించిన నందిమండపం, అటు అంతకుముందు కళ్యాణి చాళుక్యుల దేవాలయాల్లోగానీ, లేక అప్పటి వరకూ కట్టిన కాకతీయదేవాలయాల్లోనూ ఎక్కడా లేనట్లు విలక్షణ వాస్తుశైలిలో ఉంటుంది.

కాటేశ్వరాలయం7578929848_82a67c0b5b_k
అర్ధమండప, గర్భాలయం, మహామండపాలతో ఉన్న కాటేశ్వరాలయాన్ని రుద్రసేనాని తన తండ్రి కాట్రెడ్డి పేర నిర్మించాడు. చుట్టూ చిన్న ప్రదక్షిణ పథంగా వున్న ఉపపీఠం దానిపై చిన్న అధిష్టానం, పాదవర్గం, ప్రస్తర కపోతం, దానిపైన ఒక్క అంతస్థు వరకు మిగిలి వున్న ఇటుకరాతి శిథిల విమానం, కొంచెం ఎత్తైన అధిష్ఠానం, దానిపై కక్షాసనాలతో ఉన్న రంగమండపం, ప్రవేశం దగ్గర అటూ ఇటూ శిథిలమైనా పదిలంగా మెట్లెక్కండని భక్తులను ఆహ్వానించే రెండు ఏనుగు శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి.
రంగమండపంలో 16 స్తంభాలు, ద్వారబంధాలపై స్వస్తిభవూదజాలకాలతో రామప్ప ప్రధానాలయానికి తగ్గట్టుగా నిర్మితమైంది. ముందున్న మెట్లకు అటూ ఇటూ పొందికగా వున్న అధిష్ఠాన భాగాలను సంస్క ృతంలో గజహస్తాలనీ, ఆలంబన బాహులనీ అంటారు.

కామేశ్వరాలయం
రామప్ప దేవాలయానికి నైరుతి దిక్కులో నిర్మితమైన కామేశ్వరాలయం చిన్న ఉపపీఠం, సాదాగోడలు, దానిపై చిన్న కపోతం, వ్యాళ వర్గాలున్నాయి. ముందుభాగంలో అటూ ఇటూ రెండు కక్షాసనాలుండటం గమనించదగ్గ విషయం. ద్వారబంధాలు కాకతీయ శిల్ప వైశిష్ఠ్యాన్ని తెలియజేస్తున్నాయి.

కల్యాణ మండపం
రామప్ప ఆలయ దక్షిణ భాగంలో ప్రాకారానికి మధ్యగల కల్యాణ మండపం శిథిలమైపోగా దానిని భారత పురాతత్త్వ సర్వేక్షణ శాఖ పదిలపరుస్తోంది.

ప్రాకారం
ఆలయాలను అపురూపంగా కట్టించిన రుద్రుడు వాటి భద్రతను గురించి కూడా ఆలోచించాడు. ఆలయాల భద్రతతో పాటు పచ్చటి పరిసరాల నడుమ అందం ఇనుమడించేటట్లు చుట్టూ ఎత్తైన విశాలమైన ప్రాకారాన్ని నిర్మించాడు. తూర్పు, పడమర, దక్షిణ దిక్కుల్లో ప్రవేశ ద్వారాలను కల్పించాడు. ప్రాకారం దృఢంగా ఉండటానికి రెండు వరుసలతో గోడకట్టి, ఆ వరుసల మధ్య మట్టితో నింపి, పైన కప్పునూ, దానిపై అందం కోసం కలశాలను తలపించే కోడిపుంజు తలపై ఉండే తురాయి రీతిలో శిల్పకళాకృతులను నిర్మించాడు.

ఇతర దేవాలయాలు
రామప్పకు నైరుతి దిక్కులో 100 గజాల దూరంలో ఒక త్రికూటాలయం, వాయువ్యంలో చాళుక్య రీతిలో నిర్మించిన ఆలయం, చెరువుకట్టపై కుడివైపున కొండగట్టున మరో ఆలయం, చెరువుకట్టకు ఎడమవైపు ఒక త్రికూటాలయం, మరో ఏక కూటాలయం ఉన్నాయి. ఇవన్నీ శిథిలమైనా చూడదగ్గ కట్టడాలే.
కాకతీయ శిల్పంలో జైన తీర్ధంకరులు, శైవ, వైష్ణవ, శాక్త, గాణాపత్య శిల్పాలు, సామాజిక శిల్పంలో 7578931224_c948253176_kవేటగాళ్ళు, వేటగత్తెలు, నాట్యగాళ్ళు, నాట్యగత్తెలు, వాద్యగాళ్ళు, వాద్యగత్తెలు, దంపతి శిల్పాలు, నాగిని, మదనిక శిల్పాలు తలమానికాలు. శైవ శిల్పాల్లో, గణపతి, కార్తికేయ, వివిధ శివరూపాలలో నటరాజ, వైష్ణవ ప్రతిమల్లో విష్ణు, చెన్నకేశవ, శాక్త శిల్పాల్లో, సప్తమాతృక, మహిష మర్ధిని శిల్పాలు ముఖ్యమైనవి.
శాతవాహనుల తరువాత అంతటి చక్కటి రూపలావణ్యంతో బాగా నగిషీ చేసే శిల్ప ప్రక్రియ మళ్ళీ కాకతీయుల కాలంలోనే జరిగింది. మనుషులు, దేవతా శిల్పాలే కాక జంతువులకూ విశేష ప్రాధాన్యాన్నిచ్చారు శిల్పులు. దేవాలయ గోడలపై నంది, హంసలు, ఏనుగులు, గుర్రాల వరుసలు నాటి శిల్పుల ప్రతిభకు తార్కాణాలు. రామప్ప రంగమండప స్తంభాలకున్న నాగిని, యువతుల శిల్పాలు మరెక్కడా కాన రావు.
రెండున్నర శతాబ్దాల్లో వేలకొద్దీ శిల్పాలు చెక్కించి భారతీయ శిల్పకళా చరివూతలో తమకంటూ మహత్తర స్థానాన్ని కల్పించుకొన్న కాకతీయులు నిజంగా ధన్యజీవులు!
అపురూపమే కాక ఎంతో అరుదైన రామప్ప దేవాలయం మధ్యయుగపు రాజవంశ ఠీవిని, అప్పటి వాస్తు శిల్ప వైవిధ్యాన్నీ అట్లే నాటి శిల్పుల హస్తకళా లాఘవాన్ని ఆవిష్కరిస్తూ, ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటుకోసం ఎదురుచూస్తోంది.

శాసన మండపం
గణపతి దేవుని అడుగుజాడల్లో నడుస్తున్న రేచర్ల రుద్రుడు ఆలయాన్ని కట్టిన సందర్భంగా సంస్కృతంలో ఒక శాసనాన్ని వేయించి, దానిని నిలబెట్టి ఎండావానల నుంచి రక్షణకు ఒక మండపాన్ని కట్టించాడు. చక్కటి ఉపపీ నాలుగు స్తంభాలపై అందమైన కప్పుతో నిర్మించిన శాసన మండపం కాకతీయ వాస్తు కట్టడాల్లో విలక్షణమైందిగా గుర్తింపు పొందింది.
ramappa alayamloni nagini

Be the first to start a conversation

Leave a comment